ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై బి. ప్రేమ్ కుమార్ అన్నారు. తాళ్లూరు వెల్లంపల్లి బస్టాండ్లో సోమవారం దుకాణాదారులు, వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ప్రధాన రోడ్లలో రోడ్లు విస్తరించినా సరే దుకాణాదారులు, వాహనదారులు రోడ్లపై ఇష్టాను రీతిగా నిలుపుదల చేయటం వలన బస్సులు, లారీలు ఇతర వాహనదారుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న విషయాలను గమనించానని ఎస్సై చెప్పారు. రోడ్లకు, సైడు కాలువ లోపల వైపున వ్యాపారాలు చేసుకోవాలని, సైడు కాలువ బయట ఉన్నట్లయితే జరిమాన తప్పవని అన్నారు. పద్దతి మార్చుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు- రోడ్లపై ఇష్టాను రీతిగా ఆక్రమంచి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఇబ్బందులు తప్పవు
23
Jan