ఆరోగ్యబిలాషులు ప్రకృతి ఉత్పత్తులను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని తహసీల్దార్ రామ్మోహన్ రావు అన్నారు. వ్వవసాయాధికారి కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల అమ్మకం మేళా నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రకృతి సాగు ఉత్పత్తులను ప్రొత్సహించేందుకు ఆరోగ్యవంతమైన ఆహారం అంథించేందుకు ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సై ప్రేమకుమార్ మేళాను సందర్శించి ఉత్పత్తుల విశిష్టతను వ్యవసాయాధికారిని అడితి తెలుసుకున్నారు.
