ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో సోమవారం’ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ బ్రోచర్లు అందించి యోగ క్షేమాలు అడిగారు. మూడున్నరరేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా కుటుంబాలకు ఏ ఏ పథకాలు అందాయో కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్సీ కాలనీలో నివాస స్థలాలు కావాలని కోరగా అర్హల వద్ద నుండి అర్జీలు స్వీకరించి వీలైనంత త్వరగా మంజూరు చేయించాలని తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవశకానికి నాంది పలికారని అన్నారు. పెన్షన్లను ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటవ తేది అందిస్తున్న ఘనత ప్రభుత్వ సేవలకు నిదర్శమన్నారు. ప్రతి కుటుంబానికి వివిధ పథకాల ద్వారా రూ.2లక్షల – నుండి 3 లక్షల వరకు నేరుగా అందటంతో పేదల ముఖంలో చిరునవ్వులు చిందుతున్నాయని అన్నారు. మరలా రానున్న ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటమే లక్ష్యంగా అందరం కలసి పనిచెయ్యాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు పూలతో ఘన స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మా రెడ్డి, జెడ్పీటీసీ తాత పూడి రత్నరాజు, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎఎంసీ డైరెక్టర్ అన్నపురెడ్డి భిక్షాల్ రెడ్డి, జెసీఎస్ మండల కోఆర్డినేటర్ మేడికొండ జయంతి, సొసైటీ చైర్మన్ కుమ్మిత వెంకట రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి, గర్నేపూడి ప్రసన్నకుమార్, జాన్, అంబటి వెంకటేశ్వర రెడ్డి, బద్రి సుబ్బారెడ్డి, దుగ్గినేని వెంకట్, బరిగే శ్రీను, డగ్లస్, సర్పంచిలు వరగాని బాల సుందర్రావు, జనుమాల నాగేంద్ర పిచ్చియ్య, చొప్పరపు వెంకటేశ్వర్లు, వేముల పద్మావతి శ్రీనివాసరావు, కందిమళ్ల గీతాంజలి, వంగల పద్మావతి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు దాసరి పెద అంజయ్య, అధికారులు తహసీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ కుసుమ కుమారి, భూ సర్వే డిటీ రవికాంత్, ఎఈలు వెంకటేశ్వర రావు, భూ రాజు, మధు బాబు, ఏపీఓ కొండయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.





