ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – ఎస్సై ఎల్ సంపత్ కుమార్

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని ఎస్ ఐ సంపత్ కుమార్ అన్నారు. మండలంలోని సింగనపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి ప్రయాణం చేస్తూ పట్టుబడితే జైలుకి వెళ్లడం తప్పదన్నారు. గ్రామాలలో ఎక్కడైనా పేకాట కోడి పందాలు జూదం నిర్వహిస్తే అట్టివారిపై కఠిన చర్యలు తప్ప వ న్నారు. గ్రామాలలో దొంగతనాలు జరగకుండా మహిళా పోలీసులు గ్రామస్తులు సహకారంతో నిరోధించాలని అన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే వెంటనే పోలీసు లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *