ఆర్బికే లను అందుతున్న సేవలపై విజిలెన్స్ ఎస్పీ భూమన భవాని హర్ష రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాళ్లూరు మండల విఠలాపురం, ముండ్లమూరు ఆర్ బికేలలో తనిఖీలు నిర్వహించి, రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పథకాలపై ఆరా తీసారు. విఠలాపురంలో ఆర్బికేలో అందిస్తున్న యూరియా ధర, బయట ఫెర్టిలైజర్స్లో అందిస్తున్న యూరియా ధరకు పెద్ద వ్యత్యాసం లేదని, కనీసం ఒక్క 50 రూపాయలు ఉన్నా సరే ఆర్బికేలలో రైతులు కొనుగోలు చేస్తారని రైతులు తెలిపారు. బిపిటీ రకం వరి విత్తనాలు కావాల్సి ఉందని అందుబాటులో లేవని చెప్పారు. పశుసంవర్థశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలపై ఆరా తీసారు. టీఎంఆర్ దాణా, గడ్డి కోసే యంత్రాలు సబ్సిడీపై ఇచ్చినట్లు ఎహెచ్ఎ మార్టిన్ లూధరన్ తెలిపారు. కార్యక్రమంలో డిసీటీఓ రామారావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ సుధాకర్, విజిలెన్స్ ఎస్సై నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
ఆర్బికేలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు – అందుతున్న సేవలపై ఆరా- యూరియా ఇతర సేవలపై రైతులతో మాట్లాడిన అధికారులు
24
Jan