నేడు మన సమాజంలో బాలల తోపాటు బాలికలకు సమానత్వం గా ఉండాలంటే భిన్నవాదనలు ఎదురవుతున్నాయి .అందుకే ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాము ,చదువ నిద్దాం అని ఐసిడిఎస్ సూపర్వైజర్ డి హేమలత తెలియజేశారు . మంగళవారం ముండ్లమూరు లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు జాతీయ బాలికాదినోత్సవం కార్యక్రమంలో ఆమె తెలియజేశారు . కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారిని ఆవుల సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాలికలు ఈ సమాజంలో స్వతంత్రులుగా కావాలని కలలుగంటూ ఉన్నారు ,కానీ వారి కలలను శతాబ్దాలుగా కలలు గానే ఉన్నాయి. కానీ బాలికలు వారి కలలు నిజం చేయడానికి ప్రభుత్వం వారికి అనేక మార్గదర్శక పథకాలు రూపొందిస్తున్నందున ప్రతి ఒక్క బాలిక ఈ పథకాలను వినియోగించుకోవాలని ఆమె తెలియజేశారు. ముండ్లమూరు సెక్టార్ సూపర్వైజర్ ఆర్ నాగమణి మాట్లాడుతూ సమాజంలో బాలికలపై వివక్ష కారణంగా వారిని తల్లి గర్భంలో లోనే భ్రూణహత్యలు చేస్తూ ఆడపిల్లను పుట్ట నీయకుండా ఈ సమాజం అడ్డుకుంటుందని ఆమె తెలియజేశారు. మారెళ్ళ సెక్టార్ సూపర్వైజర్ ఓ.యశోద మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజంలో అన్ని రంగాల్లో సమానంగా ఉండాలంటే చదువులో రాణించాలని ఆమె తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిశా యాప్ ద్వారా బాలికలు ఆపద సమయంలో ఆదుకునే0దుకు తోడుగా ,రక్షణ కవచం గా ఉంది. కాబట్టి యాప్ ను అన్ని వేళలా వినియోగించుకోవాలని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో , అంగన్వాడీ టీచర్లు ఎన్ మంజుల, కల్పన, విజయలక్ష్మి,అజిత, తొట్టెంపూడి సారమ్మ ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
