ఫిబ్రవరి 11న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ సందర్భంగా ఎక్కువ కేసులు పరిష్కరించాలని లోక్ అదాలత్ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి జిఎల్వి. ప్రసాద్ అన్నారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న లోక్ అదాలత్ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి జిఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాదులు అధిక సంఖ్యలో కేసులు లోకాదాలతో వచ్చే విధంగా తగిన సూచనలు చేయాలని కోరారు. న్యాయవాదులు చెన్నకేశవులు, రవీంద్రబాబు శ్రీనివాస్ శాస్త్రి, దుర్గారావు, మనోహరమ్మ తదితరులు పాల్గొన్నారు .

