దర్శి భవిత కేంద్రం నందు 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసోసియేషన్ ఫర్ ఆర్టిఐ సమాచార హక్కు చట్టం జిల్లా మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మరియు మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య గారు పాల్గొన్నారు . కార్యక్రమంలో వారు మాట్లాడుతూ .. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల విద్యార్థులకు దుప్పట్ల వితరణ కార్యక్రమము ఏర్పాటు చేయడం దాతలను అభినందనీయమన్నారు . ఈ సందర్భంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జె రామకోటయ్య తన వంతు సహకారం విద్యార్థులకు చేస్తానని వారు తెలియజేసినారు. సంఘ సేవకులు జివిరత్నం మరియు రాష్ట్ర దళిత సేన నాయకులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ … ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే వైకల్యం అడ్డు రాదని వారన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ఆర్టిఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకట సుబ్బారావు మండల అధ్యక్షులు పార్శపు చూడండి చలమయ్య మండల జాయింట్ సెక్రెటరీ అచ్యుత గురు అర్జునరావు వైస్ ప్రెసిడెంట్ పరుచూరి సుబ్రహ్మణ్యం అచ్యుత శరత్ బాబు భవిత కేంద్ర నిర్వాహకులు గోపాలుని సుబ్రహ్మణ్యం ఎం శ్రీనివాసులు బి లీలావతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు .
