తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ పాఠశాలలో కార్యాలయాలలో 74వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కెవై కీర్తి, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలలో తహసీల్దార్ రామ్మోహన్రావు, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ప్రేమకుమార్, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ జి. సుబ్బయ్య, పీహెచ్సీలో వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తానీ, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఎవో ప్రసాదరావు, ఐసీడీఎస్. కార్యాలయం వద్ద సూపర్వైజర్ జ్యోతి, ఎస్టీఎం దేవరాజ్, ఎంఎల్ మల్లేశ్వర రెడ్డి, సచివాలయం-, సచివాలయం-2లలో ఈఓ ఆర్టీ ప్రసన్నకుమార్లు జెండాను ఎగురు వేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, ఎం. ఎన్. పి నాగార్జున రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు మండలంలోని అన్ని పంచాయితీలలో సచివాలయాలలో ఆయా గ్రామాల సర్పంచిల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ప్రాముఖ్యతను వివరించారు.
తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, ఎబీసీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరారావు, గీతాంజలి, జాహ్నవి. గంగ, ప్రగతి, శారద, అమెరికన్ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ప్రగతి హైస్కూల్ కరస్పాండెంట్ కొండ గురవయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు తూర్పు గంగవరంలో భారీ జెండాతో ర్యాలీ నిర్వహించారు.


