భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని బాధ్యత ఉందని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి. ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల కు ఎంపీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జండా వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల పుణ్యమే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాత. ఆదర్శ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ కే పూర్ణచంద్రరావు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్ద ఎస్ ఓ ఏ సునీత. జెండాలు ఎగురవేసి జండా వందనం స్వీకరించిన అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు. మండల పరిషత్ ఏవో రామాంజనేయులు. ఏపీ ఒకే కొండయ్య. సీనియర్ అసిస్టెంట్ సింగంశెట్టి సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు
