గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలలలో ఘనంగా నిర్వహించారు. దరిశి తహశీల్దారు కార్యాలయం వద్ద తహశీల్దారు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే డాక్టరు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎగరవేశారు. సందేశం ఇచ్చారు . సీనియర్ సివిల్ జడ్జి జి. ఎల్వి . ప్రసాద్ కోర్టు ఆవరణలో, డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి వి. నారాయణస్వామిరెడ్డి, సిఐ కార్యాలయం వద్ద సిఐ జె. రామకోటయ్య, ఎస్ఐ కార్యాలయం వద్ద ఎస్ఐ రామకృష్ణ, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ కె. కుకుమకుమారి, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ వై.మహేశ్వరరావు, ఎంఇఒ కార్యాలయం వద్ద ఎంఇఒ రఘురామయ్య జాతీయ జెండాలు ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవ సందేశాలను అందించారు.


