సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యున్నతికి కృషి చెయ్యాలని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర
అన్నారు. తాళ్లూరు జెసీఎస్ మండల సచివాలయాల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి శుక్రవారం మద్దిశెట్టి రవీంద్రను కలసి తనను పదవికి ఎంపిక చేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు, తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రకు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచి కాశిరెడ్డి, గ్రామ జెసీఎస్ కన్వినర్ టి. వరి, వార్డుమెంబర్ తోట క్రిష్ణ, కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
