ముండ్లమూరు మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు విద్యుత్ సబ్స్టేషన్ సందర్శించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా సరఫరా అవుతున్న కరెంటు గురించి ఏఈ జే భూరాజు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై అంజిరెడ్డి. గ్రేస్ ఇవాంజెలిన్ . పీఈటి రాముడు తదితరులు పాల్గొన్నారు
ఆదర్శ పాఠశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
27
Jan