ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పోలవరం గ్రామంలో శుక్రవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు నిర్వహించినట్లు వైద్యాధికారి బి మధు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …… గ్రామాల్లో వైయస్సార్ హెల్త్ క్లినికల్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణాలకు వెళ్లలేని పేద నిరుపేదల కోసం ప్రభుత్వ మే గ్రామాలకే వైద్యాధికారులను పంపించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు అన్నారు . ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా 64 రకాల మందులు 12 రకాల టెస్టులతో పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందికి షుగర్ 15 మందికి బీపీ5 బాలింతలకు5 గర్భిణీలు 25 మంది సాధారణ వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. ఏఎన్ఎం సుమతి. ఆషా లు తదితరులు పాల్గొన్నారు.
పోలవరంలో 104 వైద్య సేవలు
27
Jan