నరేంద్ర మోడీ పిలుపుమేరకు పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దర్శి రూరల్ రాజంపల్లి గ్రామంలో మల్లికార్జున హై స్కూల్లో విద్యార్థులకు ప్రధానమంత్రి చర్వాణిలో మాట్లాడినటువంటి దాన్ని వినిపించటం విద్యార్థులకు పరీక్షల పైన అవగాహన కల్పించటం జరిగినది . ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ .. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం నిరంతరం శ్రమ పడాలి అని , నిరంతరం జ్ఞానాన్ని పెంచుకోవాలని అంకితభావంతో పనిచేసినప్పుడు మాత్రమే లక్ష్యం అనేటటువంటిది తొందరగా చేరుకొని సక్సెస్ అవుతానికి అవకాశం ఉంటుందని , విద్యతోపాటు ఆటల పాటలు కూడా నేర్చుకొని మానసికంగా దృఢంగా కావాలి అని , జ్ఞానం అనేది గురువుల నుంచి వినయం తోటి వివేకం తోటి తెలుసుకొని వృద్ధిలోకి రావాలి అని, విద్యార్థి దశ నుంచి దేశభక్తిని నింపుకొని దేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండి నరేంద్ర మోడీ పిలుపుమేరకు నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యలు కావాలని మరియు జ్ఞానం ద్వారా వచ్చినటువంటి స్కిల్ ని అప్ స్కిల్, రీస్కిల్ గా మార్చి భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు కావాలని కోరారు .
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర యాదవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ , దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకల శ్రీనివాస్ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నం శ్రీనివాస్ , స్కూల్ కరస్పాండెంట్ చిన్న , దర్శి రూరల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగసాయి , దర్శి మండల ప్రధాన కార్యదర్శి చల్లా కొండయ్య , పొదిలి మండల అధ్యక్షుడు మాకినేని అమర సింహం , జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి జే ఆంజనేయులు , సీనియర్ నాయకులు కొండయ్య శెట్టి మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.

