తాళ్లూరు మండలం బొద్దికూరపాడు పంచాయితీ పరిధిలోని చింతలపాలెం ఎంపీపీఎస్పాఠశాలను మండల విద్యాశాఖాధికారి జి. సబ్బయ్య శుక్రవారం తనిఖీ నిర్వహించారు.
పాఠశాలలో ప్రార్ధన, పాఠ్య ప్రణాళికలు, రికార్డులు, విద్యార్థుల వర్క్ బుక్స్, మధ్యాహ్నభోజన పథకం, విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధానోపాధ్యాయులు చంద్రక, సీఆర్పీ మారుతి, పరిశీలన ప్రధానోపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బారెడ్డి, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

