దర్శి మండలం బొట్లపాలెం గ్రామ శివారులో బ్రహ్మాం గారి గుడి వెనక వైపు పేకాట స్థావరంపై దర్శి ఎస్సై రామక్రిష్ణ తన సిబ్బందితో అకస్మిక దాడి నిర్వహించారు. కోత ముక్క ఆడుతున్న 10 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.
30,520 స్వాధీనం చేసుకున్నారు. దర్శి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.