ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించించటమే శాశ్విత గుర్తింపు అని ఆరోగ్యశాఖ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ ఓ మాధవీలత అన్నారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం బెస్ట్ఫ్యామిలీ ఫిజిషియన్ అవార్డు పొందిన వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి కి ఘన సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ డీఎంహెచ్ మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారని, అందులో వైద్యులు, సిబ్బంది కలిసి కట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఉత్తమ సేవలు అందిస్తే ప్రజలతో పాటు ప్రభుత్వం కూడ గుర్తి స్తుందని అన్నారు. మన్నేపల్లి పంచాయితీ పరిధిలో ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డు పొందిన వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి తో పాటు సేవలు అందించిన వైద్యులు హనుమానాయక్, ఎంపీహెచ్ఎస్ కోటేశ్వరి, ఎంపీహెచ్ఎ బాల సుబ్రమణ్యం, ఆరోగ్య కార్యకర్త మేరీ, ఆశ కార్యకర్తలు ప్రేమలీల, విజయ నిర్మల, రమణమ్మ, 104 సిబ్బంది నిరంజన్, రవివర్మలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడి ప్రశంశా పత్రాలు అందించారు. ఇదే ఉత్సాహంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను మరింత ప్రజల వద్దకు తీసుకువెళ్లి మంచి సేవలు అందించాలని సూచించారు.

