ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే వ్యాధులు దరి చేరవని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సుంకర వారి పాలెం గ్రామంలో శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నవారికోసం ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద డాక్టర్లచే ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలాంటి శిబిరాలను గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య సేవలు పొందాలన్నారు. అతి ఖరీదైన 64మందులు12 రకాల పరీక్షలు నిర్వహించి మందు లు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. ఏఎన్ఎం శారద. ఎం ఎల్ హెచ్ పి రాజేశ్వరి. ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
28
Jan