మార్కాపురం సబ్ కలె క్టర్ సేతుమాధవన్ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాల య్యాయి. అదేకారులో ఉన్న డ్రైవర్, అటెండర్, సీసీలు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటన పొదిలి మండలం ఉప్పలపాడు-ఏలూరు మధ్య చోటుచేసు కుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో జరిగే సమావేశానికి సబ్ కలెక్టర్ సేతుమాధవన్ తన కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఉప్పలపాడు – ఏలూరు గ్రామాల మధ్య ఓ ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు టిప్పర్ను డ్రైవర్ వేగంగా తిప్ప డంతో సబ్ కలెక్టర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జయ్యింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపె యన్ కావడంతో సబ్ కలెక్టర్ సేతుమాధవన్కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ షేక్ జాన్ బాషా, అటెండర్ బెన్హరబాబు, సీసీ మహబూబ్బాషాకు తీవ్రగాయాల య్యాయి. వీరిని ముందుగా చీమకుర్తి ప్రభుత్వ వైద్యశా-లకు తీసుకెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్క తరలించారు. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సురేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
.
పరామర్శించిన కలెక్టర్ జెసి..
రోడ్డు ప్రమాదంలో గాయపడి రిమ్స్ చికిత్స పొం దుతున్న సబ్ కలెక్టర్ కారు డ్రైవర్ జాన్ బాషా, అటెండర్ బెన్హర్, సీసీ మహబూబ్బాషాను కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషిక్త్ కిషోర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించా లని సూచించారు.