వాతావరణంలో తేమ మంచు అధికంగా ఉండటం వలన మిరపలో బూడిద తెగులు ఆశిస్తుందని నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. తెగులు సోకిన ఆకుపై బాగం పసుపు రంగులోనికి, అడుగు బాగం బూడిద రంగులోనికి మారతాయని తెలిపారు. దీని వలన ఆకులు రాలి పోతాయని, కిరణ జన్య సంయోగ ప్రక్రియ జరగక పెరుదల లోపంతో దిగుబడి తగ్గుతుందని చెప్పారు. నివారణకు నీటిలో కరిగే గంధం 80శాతం డబ్ల్యుపి 600 గ్రాములు లేదా కెరాథీన్ 60 మి.లీ 200 నీటిలో కలిపి పిచికారి చెయ్యాలని కోరారు.
మిరపలో బూడిద తెగులు నివారణ చేపట్టాలి – వ్యవసాయాధికారి ప్రసాదరావు
29
Jan