ప్రకృతి సాగుతో పండించిన పలు రకాలు ఉత్పత్తులను రైతులు అమ్ముకునేందుకు వీలుగా తాళ్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణలో సోమవారం మేళాను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సమయం నుండి మేళ ఉంటుందని చెప్పారు. కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు, ఆ ండ్రుకొర్రలు, వేరుశనగ, బొప్పాయి, సబ్బులు, బెల్లంపొడి, తాటి కలకండ, మహాబీర విత్తనాలు, రాగి పూస, వరిగ పూస, నల్లనువ్వు ఉండలు, తాటి బెల్లం లడ్లు, చిక్కీలు, కొర్ర బూంది, అరిశలు, కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వినియోగదారులు మేళాను సందర్శించి అవసమైన ప్రకృతి ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఎవో ప్రసాదరావు కోరారు.
సోమవారం ప్రకృతి ఉత్పత్తుల మేళా
29
Jan