పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది. తజకిస్తాన్‌లో భూకంప కేంద్రం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. సుమారు 150 కిలోమీటర్లు లోతుల్లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.54 నిమిషాలకు పాక్ దేశాన్ని తాకిందని వాతావరణశాఖ పేర్కొంది.పంజాబ్ ప్రావిన్స్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి తదితర ప్రాంతాలో భూప్రకంపనాలు సంభవించాయి. ఐతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అందుకు సంబంధించిన నివేదిక ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2005లో పాక్‌లో సంభవించిన భూకంపంలో సుమారు 74 వేల మందికి పైగా మరణించారు.
పాక్‌లో భూకంపం…
29
Jan