ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్‌ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్‍రాజ్‌నగర్‌లోని గాంధీ స్క్వేర్‌లో ఈరోజు ఆదివారం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లారు. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.అయితే మంత్రిపై ఏఎస్‌ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఒడిశా మంత్రిపై ఏఎస్‌ఐ కాల్పులు ఛాతీలో దిగిన బుల్లెట్లు…..
29
Jan