తాళ్ళూరు మండలంలో మహాత్మాగాంధీ జాతి పిత వర్ధంతి వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జాతిపిత గాంధీజీ నేటి అందరికీ ఆదర్శ ప్రాయుడని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, తహసీల్దార్ రామ్మోహన్ రావు, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు వజ్జా శ్రీనివాసరావు, ఎపీఎం దేవరాజ్, ఎఈ మనోహార్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపుపొందిన పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెలుగువారిపాలెం యూపీ పాఠశాలలో తాళ్లూరు ఎబీసీ హైస్కూల్లో గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం ఎందరో మహావీరులు తమ సర్వస్వాన్ని ధారపోసి తమ ప్రాణాలను సైతం దేశం కోసం ధారపోసిన వారి చరిత్రను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
గాంధీజీ అందరికి ఆదర్శప్రాయుడు
30
Jan