కనిగిరి తహసిల్దార్ ను చెప్పుతో కొడతానన్న వైసీపీ నాయకుడు సర్పంచి కాసుల గురవయ్యను అరెస్టు చేయించే విషయంలో కలెక్టర్ ఎస్పీలు స్పందించలేదని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం తాళ్లూరులోని తనకార్యాలయంలో జరిగిన సమావేశంలో దారా మాట్లాడారు. కనిగిరి తహసిల్దార్ పుల్లారావు గిరిజనుడైనందునే కలెక్టర్, ఎస్పీలువివక్షచూపుతున్నారని, రెవిన్యూ అసోసియేషన్ నుంచి ఓదార్పు లేదని దారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసిల్దార్ కు అవమానం జరిగితే నోరు మెదపని రెవెన్యూ అసోసియేషన్ నోరు మెదపలేదన్నారు .
కనిగిరి తాహసిల్దార్ పుల్లారావుకు జరిగిన అవమానంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, దర్శి డిఎస్పి, రెవెన్యూ అసోసియేషన్ల నిర్లక్ష్యాన్ని చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు. గిరిజన తహసిల్దారుకు జరిగిన అవమానంపై కేసు నమోదై30 రోజులు దాటుతున్నా కాసుల గురవయ్య అరెస్టు విషయంలో పోలీస్ యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. కాసుల గురవయ్య పై తహసిల్దార్ పుల్లారావు ఫిర్యాదు చేయలేదని, వీఆర్వో మౌలాలి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినందున, తహసిల్దారును తిట్టిన నిందితుడు గురవయ్యను అరెస్టు చేయవచ్చో లేదో అని ఆలోచిస్తున్నామని పోలీసులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అగ్రకులాల వారు ఎస్సీ ఎస్టీలపై కంప్లైంట్ చేస్తే వెంటనే పోలీసులు ఎస్సీ ఎస్టీలను స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు పెడతారన్నారు కలెక్టర్ ను తిడితే కలెక్టరే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, అటెండరో, గన్ మానో, సీసీనో, దారిన పోయే దానయ్యో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిఆర్పిసి 154, 157 ప్రకారం ప్రథమ సమాచార నివేదిక ఎవరు ఇచ్చినా కూడా కేసు నమోదు చేయాల్సిందేనన్నారు. చంపబడిన వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు అన్నా ఆశ్చర్యం లేదని, అన్నారు తహసిల్దరును తిట్టిన కేసులో
41 నోటీసు తీసుకోవటానికి కూడా నిందితుడు కాసుల గురవయ్య నామోషీ ఫీలై, హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసినా, నిందితుడ్ని అరెస్టు చేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు.
కాసుల గురవయ్యను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య అన్నారు .
కనిగిరి తహసిల్దార్ ఎస్సీ ఎస్టీ కేసులో కలెక్టర్, ఎస్పీలు స్పందించాలి- రెవిన్యూ అసోసియేషన్ మౌనవ్రతం – తహసిల్దార్ గిరిజనుడైనందునే వివక్ష – నిందితుడైన వైసీపీ సర్పంచ్ కాసుల గురవయ్యను అరెస్టు చేయాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య
30
Jan