దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామం లో GAP పొలంబడి క్లస్టర్ నిర్వహణ లో భాగంగా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ , ADA (కమిషనరేట్) V రామ కోటేశ్వరి సందర్శించి పొలంబడి కార్యక్రమం నందు రైతు పరిజ్ఞానం కొరకు బ్యాలాట్ బాక్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది . తదనంతరం పోలంబడి రైతులకు ఎరువులు మరియు పురుగు మందులు వాటి ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రం కు సందర్శించి రైతు భరోసా కేంద్రం ద్వారా అందే సేవలు , పొలంబడి రికార్డ్ ల నిర్వహణ పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగంది. ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు M ప్రభాకర్ , DRC, నిర్మల , వ్యవసాయ అధికారులు సుచరిత ,స్వర్ణలత , బాలకృష్ణ నాయక్ , రమణ ,మాల్యాద్రి , వి ఏ ఏ లు షేక్ మాసుం బాజీ,విష్ణు వర్ధన్ రెడ్డి, ఏ సుధాకర్ మరియు రైతు లు పాల్గొనడం జగింది.
