ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో సోమవారం ప్రియతమ నేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర 3570 కిలోమీటర్లు చేసి విజయోత్సవ జరుపుకుంటున్న సందర్భంగా దర్శి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఇన్చార్జి పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగినది. కార్యక్రమాలకు కర్ణ పుల్లారెడ్డి సిరిమల్లె పోలీస్ శంకర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇన్చార్జి కొండారెడ్డి మాట్లాడుతూ బిజేపి ప్రభుత్వం వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికి విభజించు.. పాలించనే సూత్రంను ఉపయోగించి కులాలు మతాలు ప్రాంతాలు విడగొట్టి పాలించినటువంటి .. ప్రభుత్వాన్ని తరిమికొట్టి భారతదేశం అంతా ఒకటే కులం , ఒకే మతం , ఒకే ప్రాంతం అనేటువంటి నినాదంతో .. రాహుల్ గాంధీ గారు ఈ జోడు యాత్ర ప్రారంభించడం జరిగినదని అన్నారు . భారతదేశం ప్రజలందరూ కూడా ఈ మతాలను ప్రాంతాలను చూపిస్తూ .. పరిపాలించిన ప్రభుత్వాన్ని తరుముదాం అని , మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని .. మనకు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి సేవలో ఎంత అవసరం అని చేప్పారు . పరిపాలన ఇట్లానే కొనసాగితే సన్న , చిన్న కారు రైతులను అణగదొక్కి .. ఆడాని , అంబానీ లాంటి వారిని పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యం మనందరం చూస్తూనే ఉన్నాం. మనం గమనించాలి .. మనకు కాంగ్రెస్ పార్టీ రైతన్నల పార్టీ అనే ది మనమందరం గమనించి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని చేద్దామని అన్నారు . కార్యక్రమం లో కర్ణ పుల్లారెడ్డి , సిరిమల్లె పోలీస్ శంకర్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
దర్శి లో జోడో యాత్ర విజయోత్సవము నిర్వహణ
30
Jan