ఎన్నో ఆశలతో మండలంలో రైతులు సాగు చేసిన మిర్చి పంటకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒక్క సారిగా బొబ్బర తెగులు చుట్టూ ముట్టడంతో ఏం చేయాలో తెలీక అయోమయంలో పడి లబోదిబోమంటు న్నారు. బోర్లు కింద సాగు చేసివేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు. ఉన్నట్టుండి వచ్చిన మాయదారి మహమ్మారి దెబ్బకు రైతుల్లో కలవరం మొదలైంది. గ్రామాల్లో అందుబాటులో ఉన్న మందుల షాపులకు వెళ్లి క్రిమిసంహారక మందులు తెచ్చి పంటలపై పిచికారి చేసిన ఫలితం కనిపించడం లేదు. రసం పీల్చు పురుగులు ఆకుల తినే పురుగులు పువ్వులో పీల్చుపురుగులు ఆశించాయి. దీంతో తెల్లవారే సరికాల్లా చెట్లు మొత్తం ముడుచుకొని పోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి. మిర్చికి ధర బాగా ఉండటంతో లాభాలు బాగా వస్తాయని రైతులు సాగు చేస్తే కొంప మునిగినట్లయ్యింది. మండలంలో ఉమామహేశ్వరపురం. పూరిమెట్ల. భీమవరం. ఈదర .భీమవరం. పసుపుగల్లు. చింతలపూడి. తమ్మలూరు. నాయుడుపాలెం. మక్కినేని వారి పాలెం. జమ్మలమడక. మారెళ్ళ. సుంకర వారి పాలెం. నూజిలపల్లి. భక్తపల్లి. వేంపాడు. పోలవరం. శంకరాపురం .ముండ్లమూరు. పులిపాడు. తదితర గ్రామాలలో4400 ఎకరాలలో మిరప సాగు చేశారు. తీరా పంట చేతికి వస్తుందనుకునే సమయంలో ప్రతికూల వాతావరణం కనిపించింది. ఇప్పటివరకు సుమారు ఎకరాకు ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలుపుతున్నారు. భారీ ఖర్చుల నేపథ్యంలో తెగుళ్ల నివారణకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తే గుళ్లతో ఇబ్బంది అయ్యింది. – నల్ల దిమ్మె చిన్న కోటిరెడ్డి. ఉమామహేశ్వరపురం
- ఉమామహేశ్వరపురం గ్రామంలో రెండున్నర ఎకరాలలో మిర్చి సాగు చేశా ఇప్పటికీ రెండు లక్షల 50 వేలు ఖర్చు చేశా బొబ్బర తామర పురుగు సోకడంతో పంటను వదిలేసా .
గాలిలో మార్పు వస్తే పురుగు నశిస్తుంది.. తేజ. ఉద్యానవన అధికారి
మిరప పంటలో తెల్లదొమ వ్యాప్తి చెంది వైరస్ రావడంతో బొబ్బర్ తెగులు వ్యాప్తి చెంది ఆకులు పచ్చగా పసుగా రంగు మారుతాయి . ఆకు ముడతగా మారుతుంది. తామర పురుగు ఆశించడం వల్ల ఆకులు పైకి ముడుచుకు పోతాయి పువ్వులో తామర పురుగు చేరి రసాన్ని పీల్చుకుపోతు చెట్లు ఎర్రగా మారే విధంగా చేస్తాయి. రైతులు భారీ పెట్టుబడులు పెట్టవద్దు. వాతావరణంలో మార్పు వస్తే వాటంత అవే పోతాయన్నారు.

