దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాలలో ఖరీఫ్ సాగు చేసి
వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు.
రజానగరం, మల్కాపురం గ్రామాల్లో నూర్పుళ్లు జరుగుతున్న ప్రాంతాలను
సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులలో నగదు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని అన్నారు. మన్నేపల్లి,
దోసకాయలపాడు, మాధవరం, తాళ్లూరు, లక్కవరం ఆర్బికేల ద్వారా 57 మంది రైతుల వద్ద నుండి 369.92 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా అందుకు సంబంధించి రూ. 76,16,824లు రైతులకు చెల్లించినట్లు చెప్పారు. సర్పంచి వలి,విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు
31
Jan