గృహ సారధులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా, పార్టీ అభ్యున్నతికి తమ వంతు కృషి చెయ్యాలని తాళ్లూరు మండల జెసీఎస్ సచివాలయ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి కోరారు. మండలంలోని దోసకాయలపాడు పంచాయితీ పరిధిలో తోట వెంగన్నపాలెంలో మంగళవారం గృహసారధులను నియమించారు. ఈ సందర్భంగా తాళ్లూరు మండల జెసీఎస్ సచివాలయ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ …… ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానిక ప్రజా ప్రతినిథుల సహకారంతో మండలంలో పార్టీ బలోపేతానికి గృహసారధులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పీఎస్ ప్రభాకర్ రెడ్డి, కైలాష్ రెడ్డి, వెంకట రెడ్డి, కె. వెంకటేశ్వర రెడ్డి, జెసీఎస్ సచివాలయ కన్వినర్లు అంజమ్మ, వెంకట రెడ్డి వలంటీర్లు అన్నారు.
గృహసారధులు అంకిత భావంతో పనిచెయ్యాలి -తాళ్లూరు మండల జెసీఎస్ సచివాలయ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి
31
Jan