దేవవరం పంచాయతీ పరిధిలో కట్టుబడి వారి పాలెం మంగళ వారం ఎస్సీ కాలనీ జరిగిన పౌర హక్కుల దినోత్సవం కి స్థానిక గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ. కొర్నేలు అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా దర్శి తహ సీల్దార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ .. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఇంటి ముందుకు అందిస్తుందని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు,గ్రామంలో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తక్షణమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ .. దర్శి మండలంలో దళితులు చనిపోతే కనీసం ఖననం చేసుకోవడానికి స్థలాలు లేక,ఉన్న స్థలాలు ఆక్రము గురవుతున్నాయని అనేకసార్లు స్పందన అర్జిచ్చిన స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక తాసిల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ స్మశాన సమస్యలను ఆయా గ్రామాలు విఆర్ఓ తో మాట్లాడి తక్షణమే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహ సీల్దార్ ఆకుల రవిశంకర్, సీనియర్ అసిస్టెంట్ ఎం రామారావు, వీఆర్వో రమాదేవి, గ్రామ కార్యదర్శి ఆదిలక్ష్మి, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ తాండవ ఏడుకొండలు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బ్రహ్మయ్య, గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలి – దర్శి తహ సీల్దార్ శ్రావణ్ కుమార్
31
Jan