మండల కేంద్రమైన ముండ్లమూరులో సోమవారం రాత్రి అదుపుతప్పి లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్ నాగరాజుకు గాయాలు అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ప్యాపిలి నుండి టమాటా లోడుతో మార్టూరులో టమాట కాయలు దించి తిరుగు ప్రయాణంలో ప్యాపిలి వెళుతుండగా మార్గమధ్యమైన అద్దంకి దర్శి ప్రధాన రహదారిలో బ్రహ్మంగారి దేవాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మధ్యగల నక్కల వాగు వద్దకు వచ్చేసరికి దర్శి వైపు నుండి అద్దంకి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి గోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగరాజు కు నడుము వద్ద గాయాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించారు.
