గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా 104 వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నాయుడుపాలెం. పెద రావి పాడు గ్రామాలలో మంగళవారం డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ 104 వాహనం ద్వారా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 104 వాహనం ద్వారా గ్రామాల్లోనే వైద్య సేవలు నిర్వహిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు పొందాలని ఆయన అన్నారు .ఈ శిబిరంలో 75 రకాల మందులు 12 రకాల టెస్టులు నిర్వహిస్తారు. ఈ శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో షుగర్ 15. బీపీ 13 గర్భిణీలు 2. అంగన్వాడి పిల్లలు1. కౌమార దశ పిల్లలు1. గుండ పరీక్ష1. రక్తపరీక్ష1. గృహప్రవేశాలు3. పాఠశాల విద్యార్థి1 జలుబు దగ్గు జ్వరాలు 52 మందికి వైద్య సేవ లు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. హెల్త్ అసిస్టెంట్ శిరీష. సిహెచ్ఓ రత్నకుమారి. ఆశాలు తదితరులు పాల్గొన్నారు .
గ్రామాలకే ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు
31
Jan