దొనకొండ మండలం లో కస్తూరిబా గురుకుల పాఠశాల బాలిక విప్పర్ల సుప్రియ 24వ తేది అస్వస్థతకు గురై మంగళగిరి ఎస్ఆర్ఎస్ఐ వైద్యశాలలో వైద్యం పొందుతోంది. వివరాలు… మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుప్రియ కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్య అభ్యసిస్తుంది. సంక్రాంతి సెలవులకు స్వగ్రామం అయిన లక్ష్మీపురానికి వెళ్ళింది. 23వ తేదీ మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి బాలికలతో కలిసి పోయింది. 24వ తేదీ తోటి విద్యార్థులతో ఆరోగ్యం బాగోలేదని చెప్పటంతో సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సుప్రియను మార్కాపురం వైద్యశాలకు తీసుకెళ్ళగా వారు ఒంగోలు వెళ్ళమన్నారు. ఒంగోలు వారు మంగళగిరి ఎస్ఆర్ఎస్ఐకి సిఫార్సు చేశారు. అక్కడ వైద్యం పొందుతుంది. ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇబ్బందికరంగా ఉన్నాయని, బాలిక ఆరోగ్య పరిస్థితి. సరిగా లేదని వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కేజీబీవీ బాలికకు అస్వస్థత
31
Jan