ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులోని ప్రాథమిక ( జనరల్) పాఠశాల విద్యార్థి విద్యార్థులకు బుధవారం క్షేత్ర విజ్ఞాన పర్యటన లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, పోలీస్ స్టేషన్ , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు , ఏటీఎం , పోస్ట్ ఆఫీస్ , గేదెల డైరీ లకు విద్యార్థి విద్యార్థులు తీసుకువెళ్లి వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని ఎం జాస్మిన్ మాట్లాడుతూ ….. విద్యార్థిని విద్యార్థులు ఉదయం సాయంత్రం వేళల్లో స్నానం ఆచరించి పండ్లు శుభ్రం చేసుకోవాలన్నారు. ఉదయం మంచు వేళల్లో తిరగరాదని అలా తిరిగినందువల్ల జలుబు దగ్గులో జ్వరాలు వచ్చే అవకాశం ఉందని. జలుబు చేసి తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకుని తుమ్మాలని అన్నారు. అన్నం తినే ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని. పోషక విలువగల ఆహార పదార్థాలను తినాలని అన్నారు. పోస్టుమాస్టర్ అడపాల రాజకుమారి మాట్లాడుతూ ఉత్తరాలు ఒక చోట నుండే మరోచోటకు పంపించేది తపాలా శాఖ అని అన్నారు. పోస్టు కార్డు. ఇన్ ల్యాండ్ లెటర్. ద్వారా ప్రజల సమాచారాన్ని పూర్తి చేసి పంపించడం జరుగుతుందన్నారు. తపాల శాఖ గ్రామాల లోనిసమాచారాన్ని ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. పశువైద్యాధికారిని ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ పశువులలో సరైన సమయంలో నట్టల నివారణ టీకాలు వేయించాలని. పశువులకు సరైన ఆహారం సంరక్షణ కల్పించాలని అన్నారు. పెంపుడు జంతువులలో వచ్చే వ్యాధులపై సంరక్షించడానికి వ్యాధులను గుర్తించి టీకాలు వేయిస్తామన్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఏ బాలయ్య మాట్లాడుతూ ….. విద్యార్థులు బ్యాంకుకు వచ్చి బ్యాంకు పుస్తకాలు తీసుకొని దాచుకున్న డబ్బును మీ బ్యాంకు పుస్తకాల ద్వారా బ్యాంకులో వేసుకొని మీకు అవసరమైన సమయంలో డబ్బులు తీసుకోవచ్చు అని తెలిపారు. మీకు చదువు కావలసిన డబ్బును లోను ద్వారా తీసుకొని బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాంకు లోనును చెల్లించుకోవచ్చు అన్నారు. పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఏటీఎం కి వెళ్లి ఏటీఎం ద్వారా డబ్బును ఎలా డ్రా చేయాలి తెలియజేసుకున్నారు. గేదెల ఫారాన్ని సందర్శించి ఆవులు గేదెలు తినే ఆహారాన్ని గేదల యజమానులు విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రాఘవ విద్యార్థులు పాల్గొన్నారు .



