ముండ్లమూరు( మండలంలోని ఉల్లగల్లు .పసుపు గళ్ళు. వేంపాడు. శంకరాపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం ఎంపీడీవో కే కుసుమ కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కూలీలతో మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి 9గంటల వరకు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పని చేస్తే ప్రతి ఒక్కరికి250 రూపాయలు వస్తాయని ఆమె అన్నారు. జాబ్ కార్డు ఉండి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాలలో ఉపాధి పనులు జరిగేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీలకు మస్టర్లు వేసే సమయంలో అవకతవక పాల్పడితే వారిపై చర్యలు తప్పవ న్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఒకే కొండయ్య టెక్నికల్ అసిస్టెంట్ సుధాకర్. ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ
01
Feb