ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలలో సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు అందించాలని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. మండలంలోని శంకరాపురం పోలవరం గ్రామ సచివాలయా లను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయా నికి వచ్చి ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ వేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేయాలన్నారు. గ్రామాల్లోని వచ్చిన సమస్యలన్నింటిని సేకరించి రికార్డులో పొందుపరిచి ఆన్లైన్ చేయాలన్నారు. ఆన్లైన్ చేసిన సమాచారాన్ని మండల అధికారుల కు తెలియజేయాలన్నారు. ఉద్యోగ బాధ్యతల లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే అట్టి వారిపై చర్యలు తప్పవ న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌలాలి. సర్పంచి నంబూరి లీలమ్మ ఏసు. సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
01
Feb