గ్రామాల్లో ఉపాధి పనుల వద్ద కూలీల కు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి గాయాలు అయితే వెంటనే ప్రధమ చికిత్స చేయాలని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. స్థానిక వైయస్సార్ క్రాంతి పదం కార్యాలయంలో బుధవారం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు మెడికల్ కిట్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీలు పనులు చేసే సమయంలో ఎవరికైనా రక్త గాయాలు అయితే మెడికల్ కిట్ల ద్వారా ప్రధమ చికిత్స చేయాలన్నారు. పని చేసే సమయంలో ఎవరైనా అలసిపోయే నీరసంగా ఉండి ఇబ్బంది జరిగితే వెంటనే ప్రధమ చికిత్స చేసి దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకువెళ్లాలన్నారు. పనిచేసే ప్రదేశాలలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా సమకూర్చాలన్నారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్ర సహాయకులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఒకే కొండయ్య. టెక్నికల్ అసిస్టెంట్లు. మాల కొండా రెడ్డి. అశోక్. షాలెం. సుధాకర్. రూతమ్మ. క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
కూలీలకు మెడికల్ కిట్లు అందజేత
01
Feb