ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లు, వేముల గ్రామాల పరిధిలో నూతనంగా రెండు విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేయాలని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి విద్యుత్తు సీఎండీ జే పద్మ జనార్దన్ రెడ్డి ని కలిసి గురువారం వినతి పత్రం అందజేశారు. దర్శి నియోజకవర్గ పరిధిలో గల పిజియన్ కాంప్లెక్స్ నందు విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ఐదు మండలాల విద్యుత్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం డి . ఈ సయ్యద్ అబ్దుల్ కరీం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ …. ఉలగల్లు వేముల గ్రామాల పరిధిలో అధికలోడు వల్ల విద్యుత్ లో ఓల్టేజీ సమస్య ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రెండు గ్రామాల పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్య తీర్చాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సమస్యలతో గల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీ ఈ కే పిచ్చయ్య. ఏ ఈ జే. భూరాజు . ఉల్లగల్లు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య, మాజీ సర్పంచి గొంది వెంకట అప్పారెడ్డి, అన్నపురెడ్డి బిక్షాలు రెడ్డి , తూము రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
