ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి బి . మధు శంకర్ తెలిపారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల శంకరాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అరుణ కుమారి ఆధ్వర్యంలో పాఠశాలలో వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బి . మధు శంకర్ మాట్లాడుతూ .. విద్యార్థులు పరిశుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులు దరి చేరవని అన్నారు. భోజనం తినే ముందు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నందున మంచులో తిరిగినట్లయితే దగ్గు జలుబు జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పిల్లలకు జ్వరం జలుబు దగ్గు ఉన్నట్లయితే వెంటనే మీ గ్రామాల్లో ఉన్న డాక్టర్ వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు వాడాలన్నారు. ఈ శిబిరంలో150 మందికి వైద్య పరీక్ష నిర్వహించి అందులో షుగర్65, బిపి65, విద్యార్థులు10 , గర్భిణీలు. 5 , బాలింతలు5 , వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. సిహెచ్ఓ శశి. ఏఎన్ఎం ప్రియదర్శిని. ఆషాలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు
02
Feb