దొంగతనాలను అరికట్టడంలో వ్యాపారస్తులు తమ వంతు సహకారం అందించాలని దర్శి సీఐ జె. రామకోటయ్య కోరారు. ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో గురువారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామకోటయ్య మాట్లాడుతూ వ్యాపారాల సముదాయాలలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణలో తమ వంతు సహకారం అందించాలని. రోడ్లపై వినియోగదారులు వాహనాలు నిలపకుండా ముందుస్తూ సూచనలు ఇవ్వాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్థికపరమైన మోసాలు అధికంగా జరుగుతున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్ సంపత్ కుమార్. పోలీస్ సిబ్బంది. వ్యాపారస్తులు పాల్గొన్నారు .
దొంగతనాలు నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి – దర్శి సీఐ రామకోటయ్య
02
Feb