ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆంధ్రకేసరి చిత్రపటానికి సీపీ బ్రౌన్ సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి విగ్రహానికి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఈఓ జి.సుబ్బయ్య, ఎపీఓ మురళి, కార్యాలయ పర్యవేక్షకులు వజ్జా శ్రీనివాసరావు, ఈఓఆర్డీ ఎన్యూ ప్రసన్నకుమార్, ఈసీ ప్రసాద్, గ్రామకార్యదర్శి చిరంజీవి, వేల్పేర్ అసిస్టెంట్ క్రిష్ణా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
