తాళ్ళూరుమండలం విఠలాపురం గ్రామ పంచాయతి లో 2018-19 కి చెందిన ఉపాది హామీ నిధులు చెల్లింపులు సక్రమంగానే జరిగాయని, ఎలాంటి అవక తవకలు జరగలేదని విఠలాపురం సర్పంచ్, జిల్లా సర్పంచ్ ల సంఘం ఉపాదక్ష్యులు మారం ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేసారు. ఒంగోలు లో ని పంచాయతి రాజ్ అతిధిగృహం లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ .. 3.4.2021 న సర్పంచ్ గా పదవీ బాద్యతలు చేపట్టిన అనంతరం 7.9.21 న ఉపాధి హామీ నిధులు నిబందనల ప్రకారం పంచాయతి ఖాతాకు జమకాబడినాయి.తక్షణమే సంబందిత వారికి చెల్లించాలన్న అధికారుల ఆదేశముల మేరకు పనుల నిమిత్తం పెండింగు బిల్లులు చెల్లించాలన్న కోట నాగార్జున రెడ్డి అర్జి మేరకు, రికార్డులు పరిశీలించి,ప్రత్యేకఅధికారి దృవీకరణ పత్రము ఆదారంగా గతం లో చెల్లించిన పనులకు పెండింగు బిల్లులు చెల్లించడమైనది. 5. 10. 2021 తాళ్లూరు ఎంపీడీవో కు మానం రమేష్,మరియు షేక్ ఖాలిషా వలిలు బిల్లులు చెల్లింపుకు పెట్టిన అర్జి నిగ్రామ పంచాయతికి పంపియున్నారు. 27.10. 2021 న ఎంపీడీవో లేఖ ఆధారంగా పంచాయతి రికార్డులు పరిశీలించగా సదరు అర్జీదారులు ఎలాంటి పనులు విఠలాపురం లో చేసినట్లుగా లేనందున ….గ్రామ పంచాయతిసర్పంచ్ గా ఎంపీడీవో ని ….మానం రమేష్, ఖాలీష వలీలు పనులకు సంబందించిన ఆదారములు సమర్పించవలసినదిగా కోరియున్నాము. దానికి నేటివరకు ఎంపీడీవో నుండి గాని,అర్జీదారులనుండి గాని ఎలాంటి సమాదానము లేదని అన్నారు. గ్రామంలో రాజకీయ కారణాలతో అధికారులతో కుమ్మక్కై … కొందరు రాజకీయంగా నా ప్రతిష్టను దెబ్బతీయటానికి చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు. గ్రామ పంచాయతిలోని వాస్తవ లావా దేవీలను న్యాయస్తానం దృష్టికి తీసువేళతామని,చేయనిపనులకు బిల్లులు చెల్లించాలని… కోర్టు వారిని తప్పు దోవ పట్టిస్తున్న వారి గురించి న్యాయ స్థానము నకు వివరిస్తామని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమం లో సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అద్యక్షులు జి.వీరబద్రాచారి, అద్యక్షులు బెజవాడ శ్రీరామ మూర్తి పాల్గొన్నారు.
ఉపాది హామీ నిధులు చెల్లింపులు సక్రమమే – విఠలాపురం సర్పంచ్, జిల్లా సర్పంచ్ ల సంఘం ఉపాదక్ష్యులు మారం ఇంద్రసేనా రెడ్డి స్పష్టం
02
Feb