వైఎస్సార్ కంటి వెలుగుతో విద్యార్థులకు దృష్టిలోపం గుర్తించి వారికి తక్షణమే తగిన సూచనలు చేసి భవిష్యత్లో ఎంటు వంటి దృష్టి లోపం లేకుండా పథకం ఎంతో ఉపయోకరంగా ఉందని వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కస్తూరిభా పాఠశాలలో శుక్రవారం వైస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓవై కీర్తి, మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, పథకం ప్రాముఖ్యతను.. విద్యార్థులకు ఉపయోగాలు గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు అద్దాల అందించారు. కార్యక్రమంలో సర్పంచి వలి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఈఓఆర్డి ఎన్ యూ ప్రసన్నకుమార్ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



