వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలుకు వెళ్లడం తప్పదని దర్శి డిఎస్పి వి నారాయణస్వామి రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వేంపాడు వద్దగల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం నో యాక్సిడెంట్ కార్యక్రమం లో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వి నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ ….. ప్రతి ఒక్కరు వాహనదారుడు వాహనానికి లైసెన్స్ తో పాటు వ్యక్తిగత లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి చేయాలన్నారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి చేరాలన్నారు. గ్రామాలలో పేకాట. కోడి పందాలు. జూదం ఆడినట్లయితే వారిపై నిఘా వేసి పట్టుకొని జైలుకు పంపించడం తప్పదన్నారు. గ్రామాల్లో ఎవరైనా శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పన్నారు. గ్రామాలలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే మహిళ పోలీసులు నిరోధించాలన్నారు. గ్రామాలలో దొంగతనాలు జరగకుండా గ్రామస్థులు సహకారంతో నిరోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్ సంపత్ కుమార్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
