గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మీ గ్రామాలలోనే డాక్టర్ వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందిస్తున్నట్లు వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పూరిమెట్ల గ్రామంలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలో అధనూతన నూతన పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ శిబిరం నందు 74 రకాల మందులు.12 రకాల టెస్టులతో సేవలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో 116 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో బీపీలు.. షుగర్. గర్భిణీలు. బాలింతలు. కౌమార దశ పిల్లలకు. జలుబు దగ్గులు జ్వరాలు ఉన్నవారికి అవసరమైన మేర మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మీరాభి. సి హెచ్ ఓ లక్ష్మీ కుమారి.104 డీఈవో వెంకట ప్రసాద్ భూలక్ష్మి. రాజేశ్వరి. తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజియన్స్ తో ఆరోగ్యం పదిలం
04
Feb