రైతులు ప్రజలు విద్యార్థులు సుభిక్షంగా ఉండాలని పాదయాత్ర చేపట్టిన శ్రీకాంత్

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లి గ్రామానికి చెందిన చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ శనివారం గిద్దలూరు రోడ్ రాచర్ల లో ఉన్న ఆంజనేయస్వామి గుడి నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి, నెమలిగుండ్ల రంగనాయక స్వామి వరకు పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ పాదయాత్ర ను ప్రారంభించి మద్దతు తెలిపిన రాచర్ల స్పందన విద్యాసంస్థల మేనేనింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి, పేర్ల పరమేశ్వర్ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు మాట్లాడుతూ .. మాగులూరి శ్రీకాంత్ చిన్న వయసులో స్వచ్ఛంద సంస్థ స్థాపించి అధికంగా పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకోడానికి ఫీజులు కట్టి దాతల సహాయం తోటి అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారన్నారు. అలాగే గతంలో కూడా వంద పడకల ఆసుపత్రి గిద్దలూరు హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయాలని పాదయాత్ర చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం కనుక మరెన్నో పాదయాత్రలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ పాదయాత్ర చేస్తుండడం చాలా అభినందనేయమన్నారు. మాగులురి శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. స్వచ్ఛంద సంస్థ స్థాపించి 8 సంవత్సరాల పూర్తిచేసుకున్న సందర్భంగా పాదయాత్ర చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో అన్నం పల్లె సర్పంచ్ సిరిగిరి రమేష్ , ఖాదర్ వలీ, జనసేన నాయకులు వులాపు శంకర్ నాయుడు, వెంకటేశ్వర్లు,రాచర్ల హై స్కూల్, స్పందన స్కూల్, అన్నం పల్లె యుపి స్కూల్, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాదయాత్రకు మద్దతు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *