జగనన్న శాశ్విత గృహాలు త్వరితగతిన నిర్మించుకొని స్వంత గృహానికి యజమానులు కావాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. మాధవరంలో జగనన్న కాలనీలో నూతన గృహాలు నిర్మించుకొనున్న లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. నివాసం లేని ప్రతి పేద వారికి స్వంత స్థలం, నివాసం కల్పించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో స్థలాలు, గృహాలు మంజూరు అయ్యాయని అన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మించుకుని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. వారికి బిల్లులు, ఇతర సామగ్రి త్వరగా అందేలా తగిన చర్యలు తీసుకుంటానని, ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఈ మనోహర్, ఈఓఆర్జీ ఎన్ యూ ప్రసన్నకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు నుసుం ఆంజనేయులు, ఇడమకంటి బ్రహ్మారెడ్డి, ఇంజనీరింగ్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
