తిరుగబడ్డ ఇసుక లారీ – తప్పిన పెను ప్రమాదం

తాళ్లూరు, కుంకుపాడు రోడ్డులో దొర్నపువాగు బ్రిడ్జిపై ఇసుక లారీ అదుపు వెనక్కి వస్తూ తిరుగబడినది. కుంకుపాడు వైపు మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న లారీ దోర్నపు వాగు స్కీము వద్ద రోడ్పై లీక్తో రోడ్డు పూర్తిగా కుంకి లారీ దిగబడి పోయినది. అయితే విషయం తెలియని ఇసుక లారీ టిప్పర్ అటుగా అద్దంకి వైపు వెళ్లుటకు ప్రయత్నించి బ్రిడ్జిపై కొంత దూరం రాగానే విషయం గమనించి వెనక్కి మళ్లి వెళ్లుటకు ప్రయత్నించాడు. అయితే బ్రిడ్జి అంచులు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జిపై టైరు కుంకి నిదానంగా ఒక ప్రక్కకు వరిగి పడి పోయినది. అదే సమయంలో డ్రైవర్ ప్రక్కకు రావటంతో పెను ప్రమాదం తప్పినది. ఇదే దారిలో అధికంగా అక్రమ ఇసుక తరలి పోతుండటంతో దారులతో పాటు బ్రిడ్జిలు కూడ బలహీనంగా తయారు అయ్యాయి. చివరికి అదే ఇసుక లారీ కూడ వాగు ఒడ్డున పడిపోవటంపై రైతులు చర్చించుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *